పుట:Abraham Lincoln (Telugu).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఆబి! ఇక నవారున కేర్పాటు సేయవలయును శయ్య వేయుట కేదైన నొక యాధారము గావలయునే" యని హేళనముగ ననియెను.

తండ్రి యర్థము స్ఫురింపక యాబ్రహాము "మ్రానిపలకలు వేయుదు రని యెంచియుంటి" ననియెను.

"మఱేవిధమైన నవారును గానరాదు. ఆపలక నిటు లందిమ్ము."

ఇంటికప్పున కుపయోగింపబడిన జాతిపలకలన యుపయోగించి మంచ మేర్పఱచుకొనిరి. ఇదేవిధమున బుద్ధికౌశలము సూపి యొకబల్ల, కుర్చీ వీనిరెంటి జేసికొనిరి.

ఆకాలమున వారికి ధాన్యము విసరుకొని పిండి చేసు కొనక భుజించు మార్గములు దెలియవు. తిరుగలులు మన రాతితిరుగలివంటివి వా రెఱుగరు. పది పండ్రెండు మైళ్లదూరము వోయి వాయువే ముఖ్యాధారముగా గల యొక యంత్రమున దమ ధాన్యమును విసరుకొని వచ్చుచుందురు. దీనిచే గాలనష్ట మధిక మగుచుంటగాంచి థామసు బుద్ధి కౌశల్యము గలవాడు గనుక తన కుమారుని సాహాయ్యము దీసికొని పెద్దమొద్దు నొకదాని మద్యగాల్చి మనరోలుంబోలే నొకసాధనంబును నొక రోకలిని దాని నుపయోగింప మఱి యొక సాధనంబునుజేసి యాకొఱంత మాన్చుకొనియెను.