పుట:Abraham Lincoln (Telugu).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భర్త పరలోకగతుండగుటయు థామసుతల్లి యాప్రదేశము విడిచి చనెను. థామసు పెద్దవా డైనంతనే యతడు స్వపరిశ్రమమున సంపాదించుకొని బ్రతుకవలసి వచ్చెను. అతడంతగ నొడలువంచి పనిసేయువాడుగాడు. ఒకయూరి నుండి మఱియొక యూరికిని ఒక వ్యాపారమునుండి మఱియొక వ్యాపారమునకును దిరుగు స్వభావ మతనికి బట్టువడి యుండెను. సోమరితనమున బర్యటనము సలుపుచుండుట వలన నతని కొక్క చిన్నలాభము గలిగెను. అక్కడక్కడ వినుచు గనుచు వచ్చిన విశేషము లనేకము లతనిశిరోపేటిక జేరి భావికాలమున నితరులకు బ్రదర్శింప బడుచుండుట జేసి యతని కత్యాదర గౌరవముల దెచ్చిపెట్టుచుండెను.

త్రిమ్మరియై బహుకాలము చుట్టిచుట్టి కట్టకడపట నేదేని యొక వృత్తి ప్రవేశింతముగాకయని యిచ్చయొడమి యత డెలిజబెత్ టవునునందు బ్రబలుడగు జోసెఫ్‌హాంక్ససు నొక యొడ్లంగివద్ద పని నేర్చుకొన దీర్మానము చేసికొని యతని గృహమునకు బోయెను. అచ్చట నితడొక్క దెబ్బన రెండు పిట్టల గొట్టినట్లు విద్యాభార్యల రెంటిని గడించెను. వృత్తియందతని కంతచొరవ యలవడదాయెను. సర్వసాధారణ వస్తువుల నిర్మించుటయందు మాత్ర మతనికిశక్తిగలిగెను. నైపుణ్యము సూపి చక్కని పనివా డని పేరువడయుట కత డసమర్ధు