పుట:Abraham Lincoln (Telugu).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డయ్యెను. కావున నిందు గళత్రసంపాదనమె యతని కెక్కుడు లాభకారియాయెను.

ఆలాభము వొంది థామసు ఎలిజబెత్ టవునులో నొక గుడిసెకుక్కియందు దనగృహిణితో గొంతకాలము వసించి యచటినుండి నోలిన్‌చరి దరియం దంతకంటె గొంచె ముత్కృష్ట మగు నొక కొయ్యగుడిసె నిర్మించుకొని యచటికి జనియెను. అది గవాక్షద్వార శూన్యంబై, సమప్రదేశ వర్జితంబై, నిర్జన భూమధ్యస్థాపితంబై, పేదరికమున కిదె ముద్ర వెట్టుచున్నదాన నని చాటుచుండెను. అయిన నాప్రక్క శిలలమధ్యము నుండి బుడబుడ ధ్వనులచే వీనుల విందు సేయుచు స్వచ్ఛోదకంబుల కన్నుల కానంద మొసగుచు నెల్ల కాల మల్లనల్లన ప్రవహించు నొక చిన్న జలాశయమొం డాచండకర్కశరంగంబునకు వన్నెవెట్టుచుండెను.

థామసాకుటీరమున కన్న మిన్నయగు గేహంబు నిర్మించుకొన నశక్తుం డగుట నద్దానిన తన యునికి సేసికొని యుండెను. ఇట్లు దురవస్థ పాలగువా డత డొక్కడె గాడు. అతని తెగవారెల్లరును విద్యాగంధము లేక యెప్పటి కప్పుడు క్షుత్పిశాచంబు బోద్రోలు నంతటి సామర్థ్య మైనను లేని వారై దారిద్ర్యమున మునింగి తేలుచుందురు.

థామసెప్పుడును బాఠశాల ముఖము సూచినవాడు