పుట:Abraham Lincoln (Telugu).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేర్కొనబడిన రెండుమాసములకు లింక నేబదిలక్షల సైనికుల నప్పటిసేనకు జేర్ప సమకట్టి తన యుద్దేశముం బ్రకటింప నుద్యమించెను. యుద్ధమనిన జనులు వేసరి యుండుట విశదముగ గాంచి యాలోచన సభ్యులు లింకను మరల నిర్వచింపబడకపోవుట కయ్యది కారణం బగునేమోయని జడిసి దాని నాపివేయ బ్రయత్నించిరి. వారు నుడువున దెల్ల సావధానముగ విని లింక నెప్పటివలె స్థైర్యంబూని "నేను మరల దేశాధ్యక్షత వహించు టావశ్యకము గాదు. ధైర్యమున యుద్ధ సీమ బోరాడు నాకుఱ్ఱలకు సాయం బొసంగుటయు దేశము నపాయమునుండి సంరక్షించుటయు గర్తవ్యంబులు. నే నేబది లక్షల సైనికుల జేర్చియే తీరెద. అందులకై యపజయం బందవలసివచ్చిన గౌరవమున నందెదనుగాక" యని తన దలచినకార్యముం జేసెను. దైవ మతని పరిశ్రమల సఫలంబు సేసె. అతని కపజయము దలంచిన శత్రువు లడగిపోయిరి. అదివఱ కెన్నడును నేరికిని జేరనన్నిసమ్మతు లతని కాతఱి జేరెను. ఆ జయమున కనేకు లలరి తమ సంతసము బహిరంగముగ నతనికి దెలియ జేసిరి. లింకను దనయందు వారికి గల నమ్మకమునకు గృతజ్ఞత సూచించి యెవ్వరియెడను దన కసూయ యొడమనందున తన గెలుపునంజేసి యాత్మవిజయంబును నరి పరాజయంబును గల్గెనని ముదమందుట లేదనియు నితరులకు