పుట:Abraham Lincoln (Telugu).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుష్టచింతన లారోపించుట దన స్వభావములోనిది గాదనియు జనులు స్వాతంత్ర్యపరమున నుండ వారిచే నాపనిని జేయించి నందులకు సర్వనియామకుం డగు నా సర్వేశ్వరునకు నతు లొనర్చుననియు బ్రత్యుత్తర మిచ్చెను.

1865 వ సంవత్సరము మార్చినెల 5 వ తేది లింకను రెండవమాఱు దేశాధ్యక్షత వహించెను. నాటిదినము ననే కోత్సవములు జరిగెను. దేశమంతట సంతోషచిహ్నములు గాననయ్యె. అతని యుపన్యాసము మిక్కిలి చక్కగ నుండెను. అం దతడు గడచిన నాలుగుసంవత్సరములలో జరిగిన వృత్తాంతముల సంగ్రహముగ వర్ణించి తాము ప్రారంభించిన పని నెవరిమీదను గ్రౌర్యమూనక న్యాయముదప్పక దేశక్షేమముపై దృష్టియుంచి చిరమగు నెమ్మది గలుగ జేయువిధమున నెరవేర్ప దైవము దోడ్పడుగాక యని ప్రార్థించి ముగించెను.

రాజకీయోద్యోగముల గుఱించి లింకను మొదట తీర్మానింపవలసి వచ్చెను. అప్పటివఱకేగక్షవారు ప్రబలులైన నాగక్షకు జేరనివారి దీసివేయుచుంట యాచారముగ నుండెను. మాటికిమాటికి నేర్పాటులు సేయుటలో గాలహరణ మొక్కటియెగాక తమపక్షము పేరుకొఱకు నన్యాయముగ సమర్థుల గూడ నొక్కొకమాఱు తఱిమివేయవలసి వచ్చుచుండును. ఇంతియకాక యొక్కస్థానమునుండి యొక్కరుని దీసివైచిన