పుట:Abraham Lincoln (Telugu).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములనుండి సెలవు గైకొనినను నతడు చేసిన దాస్యవిమోచనమును దాసులకై యత దోనర్చిన మేలును లోకమెప్పటికిని మఱవకుండు ననుటకు సందేహము లదు.

ఇరువదియవ ప్రకరణము

ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి.

లింకను దేశాధ్యక్షత వహించి నాలుగుసంవత్సరములు గావచ్చెను. ఆ పదవికి మరల నతనినే యనేకులు పేర్కొనుచువచ్చిరి. కొందఱు పౌరు లడ్డువలుక జూచిరిగాని వారిమొఱ్ఱ లరణ్యరోదనము లయ్యె. బాల్టిమోరునందు దేశీయ మహాసభ జరుగుటయు లింకనె తమపాలకు డౌ గాతమను నిత్సుకుల సంఖ్య వీచికలపై వీచికలువోలె బొరలి ప్రతికూల శేషమునట్టె నెట్టి దట్టమగు నోటుగుట్టతిట్టల బట్టించె. యుద్ధరంగమునుండి లింకననుంగులు దమ యయ్య నెయ్యంబున మరల దేశాధ్యక్షుడై తమ్మధ్యక్షింపివలసిన దని తెల్లముగ వెల్లడించిరి. కాన దేశీయ మహాసభలయం దొక్కసీమవారు దక్క దక్కినవారెల్ల నొక్కపట్టున దమ సమ్మతుల లింకనున కచ్చుపడ నిచ్చుటయు నవ్వారును నివ్వెఱం దమ సమ్మతుల నతనికె క్రమ్మఱించిరి. ఇవ్విధమున నతడాసభవా రందఱచే బేర్కొనబడియెను.