పుట:Abraham Lincoln (Telugu).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లోచనదినములు; తక్కుంగలదినముల దేశాధ్యక్షుం జూడగోరు వారు ప్రక్కగదిజేరి తమపేరుగల చీటీలంప బ్రార్థితులు. కొన్ని సమయముల లింకను దపాలు చూచుకొనుట ముగించులోపల సేవకు డీచీటీల నొకకట్టగ బట్టుకొని యుంట గూడ దటస్థించు చుండును. ఆచీటీలవరుసన లింకనును జూడగోరువా రతని గది ప్రవేశింతురు. సాధారణముగా మూడునాలుగు గంటల కాలము వీరు వచ్చుచునే యుందురు. అందు బదిమందిలో దొమ్మిదిగు రుద్యోగార్థులు. వారి కందఱకును మిక్కిలి యాదరణతో లింకను బదులు చెప్పుచుండును. నయస్వభావంబునను, మృదువాక్యములను నతడు చూడబోవువారల కెల్ల హృదయ భాంధవుడో యన జూపట్టు చుండును. నాలుగు గంటలమీద లింక నీకార్యమునుండిలేచి భార్యతో సహా విహారార్థమేగును. ఆఱుగంటలకు సాయంకాలభోజనంబు గుడుచు. అతని పంక్తికి మిత్రు లొక్కరును లేని దినమే యుండదు. వారి సాంగత్యమున నుద్యోగపు జింతలనెల్ల మాని యతడు గెంటకీ సీమ యందువలె మెలగుచుండును."

"లింకను రాత్రి పది మొదలు పండ్రెండుగంటలవఱకు జుట్టివచ్చు చుండును. దగ్గర గల్గుకార్యదర్శుల కందఱకు దర్శన మిచ్చి వారితో బలువిషయములగూర్చి సంభాషించుచుండును. అతని పద్దతి నెఱిగినవా రతని రాత్రి జూడవలెనెన్న