పుట:Abraham Lincoln (Telugu).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బయట వెతకుచు నెక్కడలేకున్న సేనానాయకు నింటికడ గాంతురు. యుద్ధవిషయము లంతరాత్రివఱకు నట దెలిసి యుండును. గాన లింక నచటికి బోయి వినుచుండును. తక్కుం గలవారెల్ల నిద్రించుచున్నను దేశాధ్యక్షుడుమాత్రము జాగరూకు డై ప్రవర్తించుచుండును."

ఇన్ని కార్యముల నిర్వహించుచు లింకను యుద్ధభటుల స్నేహితులవిన్నపము లాలకించి వానిని నెమ్మదిగ బరామర్శించి వారికి దగు సాయ మొనర్చుటకును, వైద్యశాలలకు వెడలి పరీక్షించుటకును, సైన్యము లుండుశిబిరంబులకు బోయి తన కుఱ్ఱల మేలుకీ ళ్లెఱుంగుటకును గాల మెట్లు గడించుచుండెనో దెలియ లేక యాశ్చర్యజలధి మునిగి తేలవలసి యున్నది. ఈ విషయ మతని మనము సొచ్చినంత మఱి యే విషయమును జొరలేదనుట కనేక నిదర్శనము లున్నవి. దేశక్షేమము యుద్ధభటుల సామర్థ్యమువల్లనె కలుగుననుట యతడు బాగుగ గ్రహించి "వారిద యుత్తమ ధర్మము; వారే సంపూర్ణ గారవమున కర్హుల"నియెను. అతడు దనకడపటి దినమువఱకును యుద్ధభటులను ప్రభువులకంటె బ్రజాపతినిధులకంటె నెక్కుడు సమ్మానించుచుండెను.

ఒకతఱి నీయనకు స్వాగత మిచ్చుట కనేకులు గుమిగూడి, యొకరివెంట నొక రతనిసమ్ముఖమునకు వచ్చి మన్నన వడయు