పుట:Abraham Lincoln (Telugu).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననర్గళవిధిగ రావచ్చునని యత డుత్తరువు సేసెను. అధికారు లడ్డగింప బ్రయత్నించుటకు గూడ గారణము లేకపోలేదు. దేశాధ్యక్షత పనులె లెక్కకుమీరి లింకను కాలమంతయు నాక్రమించుకొని యతని నలయించుచుండును. ఈదిగువ గనుపఱచిన లింకను దినకృత్యముల బఠించినచో నత డీయుద్ధభటుల నెప్పుడు దనియించుచుండెనో యను నాశ్చర్యము మనకుబుట్టకపోదు.

"లింకను వేకువజామున లేచువా డగుట ప్రతిదినమును దన స్వంత లేఖన ప్రతిలేఖనమునకు రెండుమూడు గంటలబుచ్చును. అంతలోపలన నేదో యొక వార్తాపత్రిక జదువును. తొమ్మిదిగంట లగుడు బ్రాత:కాల భోజన మాచరించి యుద్ధ కార్యస్థానమున కేగి యట వృత్తాంతము లరసికొని యచ్చటి సేనానాయకునితో గొంత ముచ్చటించును. అచ్చటినుండి "సితగృహము"నకు వెడలి యొక్క కార్యదర్శి సాయముతో నుదయపు దపాలు జూచుకొనును. కొన్ని జాబులకు బ్రత్యుత్తరాంశములు గార్యదర్శి వ్రాసికొనును. తక్కినవి లింకన యుంచుకొని తరువాత వానికి దాన బదులు వ్రాయును. ప్రతి జాబును జక్కగ గమనింపబడును. చిక్కుల కిక్కలైనను బ్రత్యుత్తరముల నంద దగు జాబులెల్ల బ్రత్యుత్తరము లందుచుండును. మంగళ శుక్రవారములు మాత్రము మంత్రా