పుట:Abraham Lincoln (Telugu).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గదా! చట్టనిర్మాణసభకు నేను ప్రతినిధి గావలె నేను ప్రతినిధి గావలె ననుట మాని మనవా రెన్నడు లింకను గఱపినతెఱగున 'నేరు ప్రతినిధి యైన నేమి? దేశక్షేమమునకు బాటుపడుదము గాక' యందురు?

ఉపోద్ఘాతమున దేశాధ్యక్షులు నిర్వాచకుల సమ్మతులచే నేమింపబడు చుందురని వ్రాయబడియెనుగదా. అయిన నా నిర్వాచకులకు గూడ దారిసూపువారు దేశజనులే యగుదురు. భిన్నాభిప్రాయము లెక్కడను గలుగక మానవు. ముఖ్య విషయముల నట్టి భిన్నాభిప్రాయము లొక దేశమున గలిగినచో నా యభిప్రాయముల ననుసరించి కక్ష లేర్పడు. ప్రజాపరిపాలిత దేశముల నీకక్షల ముఖ్యాధికారము వహించును. ఏ కక్ష యభిప్రాయము జనసాన్యమునకు సమ్మతం బగు నా కక్షయ శాసించుట కర్హత నందుచుండును. * రాజ్యాధికారుల ______________________________________________________________

  • ఇంగ్లాండునందును నిదేవిధము. మనకు లార్డు కర్జను ప్రభువుగా నుండినపుడు కాంజర్వెటివు కక్షవారు రాజ్యాంగము నడపుచుండిరి. ఎల్ల ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్య మియ్యగూడదనుట వారి యభిప్రాయము. స్వలాభము గణించుటయే వారి ముఖ్యోద్దేశము. కావుననే మన మప్పుడు గుడిచిన యిడుమలు మనల నిప్పటికిని వీడకున్నవి. ఇప్పు డన్ననో లిబరల్ కక్షవారు (అనగా నందఱకు స్వాతంత్ర్య మిచ్చుటయే యెల్లరకు లాభదాయియను కక్షవారు) రాజ్యాంగము నడపుచున్నారు. కావున మనదేశమునకు మంచిరోజులు మరలవచ్చిన వనియు మన మెక్కుడు శ్రద్ధ బుచ్చుకొని