పుట:Abraham Lincoln (Telugu).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నియమింపబడుటకు మున్నా కక్షవా రొక గొప్పసభ జేర్చి తమ కిచ్చవచ్చినవానిని బేర్కొందురు. అతడ సర్వసాధారణముగ జయ మందును.

లింకను దేశాధ్యక్షతకు బెనగునప్పటి కిట్టి కక్ష లట మూ డుండెను. అందు రిపబ్లికను (అనగా ప్రజలుగాని, వారి ప్రతినిధులుగాని రాజ్యము నడపవలె ననియు నందఱకు జాతి మతభేదము లెంచక స్వాతంత్ర్యము గలుగజేయ వలె ననియు నను) కక్షయె మహాబలవంతముగ నుండెను.

ఆ రిపబ్లిక్ జాతీయసభ 1860 వ సంవత్సరము జూను నెల పదునాఱవతేదీన చికాగాలో జరుపబడెను. దూరాగత ప్రజలకును వారి ప్రతినిధులకును గూర్చొనుటకు దగినవిధమున నొక పెద్దపందిరి నిర్మించియుంచిరి. సభనా డచ్చట నిరువది యైదు వేలజను లాసీనులైరి. ఆకక్షవారిచే నేమింపబడతగినవారు లింకనుతో నెనిమిదిగు రుండిరి. అందు గొందఱు లింకనున కంటె నెక్కుడు ప్రసిద్ధిగాంచినవారు. అయినను వారిలో వారికి సమ్మతు లెచ్చుతక్కువ లైనతఱి వారివారుగూడ లింకనునకే సమ్మతు లిచ్చిరి. కావున నాసభవారిచే లింకను దేశాధ్యక్షతకు బేర్కొనబడియెను. లింకను దేశాధ్యక్షతకు _____________________________________________________________ పాటుపడిన ఫల మందుదుమనియు మనలో ప్రాముఖ్యులు నొక్కి వక్కాణించుచున్నారు.