పుట:Abraham Lincoln (Telugu).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాస్యనిరాసకుడు. మూడవవాడు బానిస వ్యాపారుల తెగకు జేరినవాడు. అయిన నీ మూడవవాని దిగవిడచి యాపక్షమువారు మాథిస ననువాని బానిస వ్యాపార విషయమున నుపేక్షకుని నియమింప బ్రయత్నించిరి. మూడు సమ్మతులు సేరిన జయమందుకాల మతనికి సంప్రాప్త మాయెను. అది చూచి లింకను బానిస వ్యాపారులు విజృంభించి విజయము నొందుదురని తెలిసికొని తనపక్షమువారు దనకు సమ్మతులియ్యవలదనియు ట్రంబలున కియ్యవలసిన దనియు వేడెను. అయిన నతని పక్షమువా రతనికి నిచ్చెదమని పట్టుపట్టిరి. దానిమీద నతడు మిక్కిలి స్థైర్యముపూని "మీ రట్లు చేసి తీరవలసినది. వేరుమార్గము లేదని" గంభీరస్వనమున శాసించెను.

అతని కక్షవారు గొందఱు మిక్కిలి చింతిల్లి యేడ్వగడగినను నతనిమాట జవదాట రైరి. రెండుకక్షలవారు సేరుటచే ట్రంబలు సీమ ప్రతినిధి సభ్యు డాయెను. ఈ తరుణమున లింక నౌదార్యము బయలుపడినట్లు మఱియెప్పుడును బయలుపడ దయ్యెను. అప్పు డాతని గొప్పతన మచటిజనుల మనస్సీమ యందు స్థిరముగ నాటబడెను. దేశసంరక్షణమున కిట్టి యౌదార్యమేగదా యనేకపర్యాయములు గావలసి యుండును. అదియు మనదేశమున నిప్పటి స్థితిలో మనకు ముఖ్యతమము