పుట:Abraham Lincoln (Telugu).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఓ! కాడ్గల్ల" ని మన:పూర్వకముగ హస్త మొసగి "మీ రీమధ్య పెద్ద దురదృష్టము పాల బడితిరని వింటినే" యనెను. కాడ్గల్‌తుపాకిమం దాకస్మికముగ గాలుటవలన నొక చేయి గోలుపోయి యుండెను. కావున "అవును. కొంతవఱ కద్రుష్టహీనుడనె! ఇంతకంటె నెక్కువ యపాయము గలిగి యుండవచ్చును. అది తప్పిన"దనెను.

"సరియె. అది వైరాగ్యమార్గ మయ్యెను. మీ వ్యాపారమైన జక్కగ జరుగుచున్నదే" యని లింకను ప్రతి పల్కెను.

"చెడవలసినంత చెడినది. వ్యవహారమున సున్న యగుటయె గాక కాయస్థితినిగూడ నణగద్రొక్క బడినాడను."

"మీ గతిజూచిన జాల విషాదము గల్గెడిని. అయ్యో! పాపమ" ని లింకను శోకార్ద్రహృదయముతో నొడివెను.

"తమకు నే నియ్యవలసిన ద్రవ్యమువిషయము యోచించుచుంటి"నని కాడ్గల్ విన్నదనమున బల్కెను.

లింకను సగము నవ్వుచు "దానికేమి? మీ రావిషయమిక దల పెట్టకుడ" ని యనుచు దన చేతిపుస్తుకమునుండి యా పత్రము దీసియిచ్చెను.

సీమ ప్రతినిధి సభ్యత్వ మొకమాఱు ముగురు కోరు చుండిరి. అం దొకడు లింకను. రెండవవాడు ట్రంబ లను