పుట:Abhinaya darpanamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రియుఁడు, శక్త్యాయుధ తోమరాయుధములను ప్రయోగించుట, ఘంటానాదము, పేషణము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థశిఖరహస్తలక్షణమ్

ముష్టిరూర్ధ్వాకృతాంగుష్ఠః సఏవ శిఖరః కరః.

282


సుమేరుం కార్ముకీకృత్య తన్మధ్యే చంద్రశేఖరః,
హస్తేన యేన జగ్రాహసో౽భవచ్ఛిఖరఃకరః.

283


శిఖరో మేరుధనుషో జాతస్తస్య ఋషిర్జినః,
గంధర్వజాతిశ్శ్యామాంశురధీశో రతివల్లభః.

284

తా. ముష్టిహస్తము పైకెత్తఁబడిన బొటనవ్రేలు గలదయ్యెనేని శిఖరహస్త మగును. ఇది పూర్వకాలమందు శివుఁడు త్రిపురాసురులతో యుద్ధము చేయుటకు మేరుపర్వతమును విల్లుగా చేసి దాని నడిమిభాగమును పట్టునపుడు శివునివలనఁ బుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి జినుఁడు. వన్నె చామన. అధిదేవత మన్మథుఁడు.

పితౄణాం తర్పణేస్థైర్యే కుటుమ్బస్థాపనే౽పిచ,
నాయకే శిఖరే మిత్రే తిర్యక్చే దంతధావనే.

285


వ్యజనేతాలవృంతస్య భేదే కిమితి భాషణే,
శృంగారపయసోపానే చతుస్సంఖ్యా విభావనే.

286


శక్తితోమరయోర్మోక్షే ఫలాంశక పరిగ్రహే,
విలాసినీనమ్రభావే లజ్జాయాం కార్ముకేస్మరే.

287


పురుషే నిశ్చయే స్తమ్భే ఘంటానాదేచ నర్తనే,
నా౽స్తీతి వచనే దానే స్థాయిభావే వినాయకే.

288