పుట:Abhinaya darpanamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహిషాసురమర్దన్యాం వీరాంశే హయవల్గనే,
అర్ధచంద్రాదితిలకే కబరీచిహ్నధారణే.

289


ఇంద్రనీలే గాఢభావే శిఖరస్సత్ప్రయుజ్యతే,

తా. పితృతర్పణము, కుటుంబమును నిలుపుట, నాయకుఁడు, శిఖరము, స్నేహితుఁడు, అడ్డముగఁ బట్టినయెడ పండ్లు తోముకొనుట, వింజామరము, విసనకఱ్ఱ, ఏమని యడుగుట, గిండిచెంబు, నీళ్లు త్రాగుట, నాలుగని లెక్కపెట్టుట, శక్తి అను ఆయుధమును వైచుట, ఈటెను విసురుట, ఫలాంశమును గ్రహించుట, ఆఁడువారియడఁకువ, సిగ్గు, విల్లు, మన్మథుఁడు, మగఁడు, నిశ్చయము, స్తంభము, గంటవాయించుట, బోగమాట, లేడనుట, ఈవి, నిలుకడ గలిగియుండుట, పిళ్ళారి, మహిషాసురమర్దని, వీరుఁడు, గుఱ్ఱమును దాఁటించుట, అర్ధచంద్రతిలకము మొదలగునవి, కొప్పుగురుతును పూనుట, ఇంద్రనీలము, దృఢత్వము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.

11. కపిత్థహస్తలక్షణమ్

అంగుష్ఠమూర్ధ్ని శిఖ రే
వక్రితా యది తర్జనీ.

290


కపిత్థాఖ్యకరస్సో౽యం
తన్నిరూపణముచ్యతే,

తా. ముందు చెప్పిన శిఖరహస్తము అంగుష్ఠముపై చూపుడువ్రేలు వంచఁబడెనేని కపిత్థహస్త మగును.

వినియోగము:—

లక్ష్మ్యాంచైవ సరస్వత్యాం వేష్టనే తాళధారణే.

291


గోదోహనేచా౽౦జనేచ లీలాత్త సుమధారణే,