పుట:Abhinaya darpanamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. పట్టు, నడుము, ప్రయోజనము, సంకేతము, క్షేమము, బలి యిచ్చుట, ప్రాకృతజనుల నమస్కారము, గట్టిపట్టు, గంటను పట్టుట, వడిగా పరుగెత్తుట, తేలిక, జెట్టిపోట్లాట, కేడెము మొదలయినవానిని పట్టుట, నిలుకడ, తలవెండ్రుకలు పట్టుట, పిడికిటిపోటు, గద యీటె మొదలయిన ఆయుధములను పట్టుట, నీలవర్ణము, శూద్రజాతి వీనియందు ఈహస్తము వినియోగింపఁబడును.

10. శిఖరహస్తలక్షణమ్

చేన్ముష్టిరున్నతాంగుష్ఠ
స్సఏవ శిఖరః కరః,

తా. ముందు చెప్పిన ముష్టిహస్తమందు అంగుష్ఠమును పొడవుగా నెత్తినయెడ శిఖరహస్త మగును.

వినియోగము:—

మదనే కార్ముకే స్తమ్భే నిశ్శబ్దే పితృతర్పణే.

279


ఓష్ఠే నాథేచ రదనే ప్రవిష్టే ప్రశ్నభావనే,
అఙ్గేనా౽స్తీతి వచనే స్మరణే౽భినయాంతరే.

280


కటిబంధాకర్షణే చ పరిరమ్భవిధౌధవే,
శక్తితోమరయోర్మోక్షో ఘణ్టానాదే చపేషణే.

281


శిఖరోయుజ్యతేసో౽యం భరతాగమవేదిభిః,

తా. మన్మథుఁడు, ధనుస్సు, స్తంభము, శబ్దములేమి, పితృతర్పణము, పెదవి, పెనిమిటి, దంతము, ప్రవేశించుట, ప్రశ్న చేయుట, అవయవము, లేదనుట, తలఁచుట, ఇతరాభినయము, నడుముకట్టు నీడ్చుట, కౌఁగిలింత,