పుట:Abhinaya darpanamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. మిక్కిలి నిక్కును చూపునదియు, సమమయినదియు, వికాసము గలదియు, చక్కగా తెరవఁబడిన రెప్పలు గలదియునైన చూపు విస్మయదృష్టి యనఁబడును. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు చెల్లును.

9. దృప్తము:—

స్థిరావికాససహితా నిశ్చలీకృత తారకా,
స్వసన్నివేశినీదృప్తా దృష్టిరుత్సాహగోచరా.

135

తా. నిలుకడగలదియు, వికాసముతోఁ గూడినదియు, చలింపనినల్లగ్రుడ్లు గలదియు, స్వస్థానగతమయినదియు నైన దృష్టి దృప్త యనఁబడును. ఇది ఉత్సాహమందు చెల్లును.

10. విషణ్ణము:—

విస్తారితపుటద్వన్ద్వా విస్రస్తాన్త నిమేషణా,
స్తబ్ధతారామనాగ్దృష్టి ర్విషణ్ణేతి నిగద్య తే.

136

తా. విరిసిన రెప్పలును, తొలఁగిన రెప్పపాట్లును, చలింపని నల్లగ్రుడ్లునుగలది విషణ్ణదృష్టి యనఁబడును.

వినియోగము:—

విషాదే చైవ చింతాయాం దృష్టి రేషా ప్రకీర్తితా,

తా. భేదమునందును, చింతయందును ఈదృష్టి వినియోగించును.

11. భయానకము:—

సభోద్వృత్త్వాపుటా౽త్యర్థం చఞ్చలాఫుల్లతారకా.

137


భయానకా భవేద్దృష్టిః భృశంభీతే భయానకే,

తా. చలింపనిమీఁదికి ఎత్తఁబడిన రెప్పలతో, మిక్కిలి చలించుచు, వికాసము నొందియున్న నల్లగ్రుడ్లుగలచూపు భయానకదృష్టి యనఁబడును.