ఇది మిక్కిలి భయపడుటయందును, భయానకరసమునందును వినియోగపడును.
12. సాచి:—
| సాచీదృష్టిరితిజ్ఞేయా అపాఙ్గచలనక్రమాత్. | 138 |
| ఇఙ్గితాదిష్వియంప్రోక్తా భరతాగమవేదిభిః, | |
తా. కడకంటి చలించునది సాచీదృష్టి యనఁబడును. ఈదృష్టి ఇంగితము మొదలైనవానియందు వినియోగించును.
13. ద్రుతము:—
| తారాద్వయస్య చలనాద్ద్రుతదృష్టిరుదాహృతా. | 139 |
తా. రెండునల్లగ్రుడ్లయొక్క చలనముగలది ద్రుతదృష్టి యనఁబడును.
వినియోగము:—
| ఏతస్యా వినియోగస్తు సమమాదిషు కీర్తితా, | |
తా. ఈదృష్టి సంభ్రమము మొదలైనవానియందు వినియోగింపఁబడును.
14. వీరము:—
| దీప్తా వికసితాఫుల్లా మధ్యా గామ్భిర్యశాలినీ. | 140 |
| వీరా వీరరసే యోజ్యా అక్షుబ్ధా సమతారకా, | |
తా. వెలుఁగునదియు, తేటయయినదియు, విరిసినదియు, ఉగ్రమును శాంతమునుగాక మధ్యస్థమై యుండునదియు, లోపల నణఁగిన యభిప్రాయము గలదియు, కలక లేనిదియు, సమములయిన నల్లగ్రుడ్లు గలదియు నైనచూపు వీరదృష్టి యనఁబడును. ఈదృష్టి వీరరసమునందు ఉపయోగించును.