వినియోగము:—
| దర్శనే తుంగవస్తూనాం పూర్వజన్మనియుజ్యతే, | |
తా. ఎత్తైనపదార్థములను జూచుటయందును, పూర్వజన్మమును తలఁచుటయందును ఈదృష్టి చెల్లును.
6. ఆద్భుతము:—
| కిఞ్చిత్కుంచితపక్ష్మాన్తా విస్మయోత్క్షిప్తభ్రూలతా. | 131 |
| సవికాససమాదృష్టి రద్భుతేతిప్రకీర్త్యతే, | |
తా. కొంచెము వంచఁబడిన రెప్పకొనలును, ఆశ్చర్యముచేత నెత్తఁబడిన కనుబొమ్మలును గలిగి వికాసముతోఁ గూడియున్న సమదృష్టి అద్భుతదృష్టి యనఁబడును.
వినియోగము:—
| ఏషాతు భావశాస్త్రజ్ఞైరద్భుతాదిషు కీర్తితా. | 132 |
తా. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు వినియోగించును.
7. కరుణ:—
| విస్రస్తార్ధ వికాసాస్యాదశ్రుమన్ధరతారకా, | 133 |
తా. దిగువకు వ్యాపించినదియు, సగము తెరవఁబడినదియు, కన్నీళ్లచే మెల్లగా తిరుగుచున్న నల్లగ్రుడ్ లుగలదియు, ముక్కుకొనయందు నిలువఁబడినదియు నైన చూపు కరుణాదృష్టి యనఁబడును. ఈదృష్టి కరుణారసమునందు వినియోగపడును.
8. విస్మయము:—
| ఉద్ధతా రచనా౽౽త్యర్థం సమా వికసితా తథా, | 134 |