పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాబాయి

71

మ్ము నవమాన పఱుపుచుండఁగా మీరు విని యెట్లు సహించెదరు? ఇంతకంటె యుద్ధముచేసి వైరులచేఁ జంపఁ బడుట సర్వోత్తమముకాదా? శూరాగ్రేసరులగు సరదారులారా! మీరిటులనుపేక్షచేయకుఁడు ! మీకుఁ గలిగిన పౌరుషహీనతయను కళంకమును సంపూర్ణముగాఁ గడుగుఁడు. మీకుఁగల శౌర్యధైర్యాదిగుణముల నగుపఱుప నిదియే సమయము. లెండు నడువుఁడు. మఱియొకరిరాకకు నిరీక్షింప నేల ? ఒరలనుండి మీ మీఖడ్గములను తీయుఁడు. "జయహర ! జయమహాదేవ," యను రణఘోష మొనర్పుఁడు. తీవ్రగతినరిగి సంగ్రామరంగమునందు మీమీప్రతాపములను గనుపఱుపుఁడు! నేనిదే యుద్ధమునకుఁ బోవుచున్న దానను."

ఇట్లని యామె యొకగుఱ్ఱము నెక్కెను. అప్పుడు రజపూతులందఱు తమయౌదాసీన్యమును వదలి యుద్ధసన్నద్ధులైరి. మేకలుగానున్న యావీరులు విరాబాయిప్రోత్సాహముచే శార్దూలములుగా మాఱిరి ! అందువలన నాభీమపరాక్రములందఱును నేక వాక్యతగా జయఘోష మొనర్చిరి. అపుడు వాఱందఱు "యుద్ధమునందు శత్రువులను జంపెదము లేక వారిచేఁ జచ్చెదమేకాని పగఱకు వెన్నియ్యమ"ని ప్రమాణములు చేసిరి.

విరాబాయియు వారియావేశమును, దృఢనిశ్చయమును గని విశేష ప్రోత్సాహముగలదియై యుద్ధమునకు వెడలెను. ఆమె తనసైన్యముతో నాకస్మికముగా నాఁకొన్నయాఁడుసింగమువలె శత్రుసైన్యములపై నకస్మాత్తుగాఁబడెను. అందువలన విజయానంద మునం దోలలాడుచుండిన యగ్బరుసైన్య మీ