పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ప్రళయమున కోర్వఁజాలక నలుదిక్కులకుఁ బాఱదొడఁగెను. వారినిఁ బోనియ్యక పట్టుకొని విరాబాయిసైనికులు కాలాంత రుద్రులభంగి యంతము నొందింపసాగిరి వారికి నిరుత్సాహకరముగా విరాబాయి తానును అనేక తురుష్కులను వీరస్వర్గమునకు నంపుచుండెను.

ప్రళయాగ్నినిబోలిన యామె పరాక్రమము గని యగ్బరత్యాశ్చర్యమును బొందెను. ఆయన జడునివలె నేమియుఁ దోఁచక నిశ్చేష్టితుఁడయి నిలువఁబడెను. అప్పు డాక్షత్రియవీరుల యుత్సాహంబు రెట్టింపయవనసైన్యము ననేకరీతుల బాధింపఁ దొడఁగిరి. బాదుషా తనకు జయము కలుగుటమాఱుగా నపజయమగుటఁ గనిచేయునది లేక సంధినిఁ దెలుపుపతాక మెత్తెను. తత్క్షణమే ఉదయసింహుని సహితము బంధవిముక్తునిఁ జేసెను. పరాక్రమవంతురాలయిన విరాబాయివలన మహాబలవంతుఁడైన అక్బరునంతటి తురుష్క ప్రభువుసహితముజయ కాంక్షనుమాని హతశేషులగువారింగొని మరల తనపురి కేగవలసినవాఁ డాయెను. తదనంతర మారజపూత లందఱును విజయానందముతో సింహనాదములు చేయుచు విరాబాయి ననేకవిధములఁ గొనియాడుచు విరాబాయితోడను, ఉదయసింహునితోడను పురప్రవేశముచేసిరి. అంతకుఁ బూర్వము తేజోహీనమైనచితూరుపట్టణము రాణిగారి విజయ వార్తవిని మరల తనదివ్యతేజమునుబొందెను. జనులందఱును పరమానందభరితులయిరి. విరాబాయి జయమునుగాంచి విశేష తేజస్వినియయ్యెను. పురవాసు లంద ఱావీరరజపూతులను, రాణాగారిని, రాణిగారిని, మంగళ వాద్యములతో నెదుర్కొని వారిపై పుష్పవృష్టి చే