పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
70
అబలాసచ్చరిత్ర రత్నమాల.

రాజభవనమునందు నిరుపయోగములై పడియున్న యనేకశస్త్రములామె కంటఁబడఁగా నామెయందు నడఁగియున్న శౌర్యాగ్ని ప్రజ్వలింపసాగెను. అంత నామె నిలువక, యుద్ధమున కనుకూలమగు పురుషవేషముఁ దాల్చి యనేకాస్త్ర శస్త్రములను ధరియించి కాళికాదేవి ప్రత్యక్షమైనది యనినట్టుగా రాజపుత్రుల సభలోకిఁ బ్రవేశించెను.

సుకుమారమగు మేనితోఁబురుష వేషధారిణియు, శస్త్రధారిణియునై వచ్చినవిరాబాయినిఁ గనినతోడనే యచటి రజపూతువీరు లాశ్చర్యమగ్నమానసు లయిరి. స్వాతంత్ర్యేచ్ఛయు, స్వధర్మాభిమానమును హృదయమునం దుండుటవలన నామె కాంతి మిగులప్రజ్వరిల్లెను. ఆమె మిగుల రోషముతో నచటఁ గూడియున్న రాజపుత్రులతోనిట్లనెను, "శూరాగ్రేసరులగు రజపూతులారా! మీరిట్లధోముఖులై చింతిల్లుచు నెవరి కొఱకు నిరీక్షింపుచున్నారు. మాయందలి శౌర్యధైర్యాది క్షత్రియగుణము లెటుపోయెను? చితూరుసంస్థాన మిపుడే పౌరుషహీనమయ్యెనా? అచటి రజపూతవీరులందఱు కేవలము శ్యాసోచ్ఛ్వాసము గలపురుగులై పోయిరా? వీరమాత యగు భారతవర్షము నేఁడే నిస్తేజమై పోయెనా? మీరు శూరులవంశములయందేల జన్మించితిరి? అటుల జన్మించినవారు వైరులకు వెన్నిచ్చి యేల పాఱివచ్చితిరి? ఇప్పు డింద ఱేకీభవించి యేమిచింతించెదరు? చితూరు నలంకరించువాఁడును, మనప్రాణసమానుఁడు నగుమహారాజునుశత్రువులు కారాగృహబద్ధుని జేయఁగా స్త్రీలవలె చేతులకు గాజులు తొడుగుకొని యింట నుండుట కేల సిగ్గుపడకున్నారు? నేనిట్లు బాహాటముగా మి