పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
46
అబలాసచ్చరిత్ర రత్నమాల.

రంభమును చేసి తలవెంట్రుక లారులోపల నొకకాండమును ముగించెనని లోకవార్త గలదు. "అక్కడక్కడఁ గొన్ని వ్యాకరణదోషము లున్నను మొత్తముమీఁద నీమెకవిత్వము మిక్కిలి మృదువై, మధురమై రసవంతముగా నున్నది. ఈరామాయణము గొంతకాలము క్రిందటివఱకును వీధిబడులలో బాలురకు పాఠముగాఁ జెప్పుచుండిరి. ఇది పురుషులు చెప్పిన గ్రంధములలో ననేకముల కంటె మనోజ్ఞమై ప్రౌఢమైయున్నది." అని కవిచరిత్రకారు లీమెకవిత్వమునుగుఱించి వ్రాసి యున్నారు. మొల్లభక్తిపూర్వకముగా రచియించిన రామాయణము మొల్లరామాయణ మను పేరిట నాంధ్రదేశమునం దంతటను సువిఖ్యాతమే. ఈరామాయణములోని కొంతభాగము ప్రవేశపరీక్షకుఁ బఠనీయగ్రంధముగా నప్పుడప్పుడు నియమింపఁబడియున్నది. ఇందువలన నీరామాయణ మొకశ్రేష్ఠ మైన కావ్యమని స్పష్టమగుచున్నది. ఈమె కవనధోరణిఁ దెలుపుటకయి మొల్లరామాయణమునందలి కొన్ని పద్యముల నిందు దాహరించెదను.

                 ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందువాహినీ
                     రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గో
                     రాజులు భోగమందు దినరాజులు సంతతతేజమందు రా
                     రాజులు మానమందు నగరంబున రాజకుమారు లందఱున్

                 ఉ. సాలముపొంతనిల్చి రఘుసత్తముఁ డమ్మరివోసి శబ్దవి
                     న్మూలముగాఁగ విల్ దివిచిముష్టియుదృష్టియుఁగూర్చిగోత్రభృ
                     త్కూలము వజ్రపాతహతిఁ గూలువిధంబునఁ గూలనేసెన
                     వ్వాలిఁ బ్రతాపశాలి మృడువందనశీలి సురాలిమెచ్చఁగన్