పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
45
మొల్ల

నర్థమెల్లఁ' దోఁచునదియయి, 'గూఢశబ్దవీతతి కొట్లాట' లేనిది యయి ద్రాక్షాపాకమయి యొప్పుచున్నది. గూఢపదగుంభనముచే నర్థకాఠిన్యము సాధించి చదువరులను బాధపెట్టుట యామె కెంతమాత్రమును ఇష్టము లేదు. కవిత్వధోరణియెట్టు లుండవలయునో యన్నవిషయమయి యీమె సుందరమయిన మూడుపద్యములు వ్రాసియుంచినది. ఆమూడు పద్యములు కవిత్వము జెప్పువా రందఱును తమతమ హృత్పటములమీఁద వ్రాసి యుంచుకొనఁ దగినవి. అవి యేవియన : _

                క. మును సంస్కృతంబు తేఁటగఁ
                    దెనిఁగించెడిచోట నేమి తెలియక యుండన్
                    దనవిద్య మెఱయఁ గ్రమ్మఱ
                    ఘనముగ సంస్కృతము చెప్పఁగా రుచియగునే.

                గీ. తేనె సోఁక నోరు తియ్యన యగురీతిఁ
                    దోడ నర్థ మెల్లఁ దోఁచకున్న
                    గూఢశబ్దవితతి కొట్లాటపని యెల్ల
                    మూఁగ చెవిటివారి ముచ్చటరయ.

                క. కందువమాటల సామెత
                    లందముగాఁ గూర్చి చెప్ప నవి తెనుఁగునకుం
                    బొందై రుచియై వీనుల
                    విందై మఱికానిపించు విబుధుల కెల్లన్.

మొల్లకుఁ గవిత్వస్ఫూర్తి విశేషముగానుండినందున నామె యాశుకవిత్వము సులభముగాఁ జేయుచుండెను. మొల్ల తలయంటికొని స్నానము చేసిన పిదప రామాయణరచన కా