పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పద్మిని.

                  పత్యనుకూలా చతురాప్రియంవదా యాసురూపసంపూర్ణా
                  సహజస్నేహరసాలా కులవనితా కేనతుల్యాస్యాత్. [1]

ఈపతివ్రతాతిలకము పండ్రెండవ శతాబ్దారంభమునందు జన్మించెను. ఈమెతండ్రి సింహళద్వీపవాసి యగు హమీరసింహచవ్హాణుఁడు. ఈసతీరత్న మసమానరూపవతి యగుటచే జననీజనకు లామెకు పద్మిని యని పేరిడిరి. పద్మిని వివాహయోగ్య యైనపిదప రజపుతస్థానములోనిదైన మేవాడ్ అనుసంస్థానమున కధీశ్వరుఁడగు భీమసింహరాణాగారికి నామె నిచ్చి వివాహముఁ జేసిరి. వివాహానంతరము పద్మిని తన రూపమునకుఁ దోడు సుగుణములు సహాయపడఁగా భర్తకుఁ బ్రాణతుల్యురా లాయెను.

ఆకాలమునం దారాజ్యము రాణాలక్ష్మణసింహుఁ డను బాలరాజు పరిపాలనలో నుండెను. కాని ఆతఁడు బాలుఁ డగుట వలన నాతని పినతండ్రి యగు భీమసింహుఁడే రాజ్యతంత్రములను నడుపుచుండెను. భీమసింహుఁడు మిగుల శూరుఁడును, చతురుఁడును నగుటవలన నాతనిరాజ్యమున కంతగా శత్రుల భయములేక ప్రజలు సుఖముగానుండిరి. కాని వారి దురదృష్ట

  1. పతికి ననుకూల యైనట్టియు, ప్రియభాషిణియు సురూపవతియు నైన కులవనితతో నెవ్వరును సమానులు కారు.