పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమఱ్ఱాజు జోగమాంబ.

27

బిడ్డలవలె జూచి వారిని పోషింపుచుండెను. తోడికోడండ్రతో తగవు లాడక కలసిమెలసి యుండెను.

ఈపె కొకకూఁతురును, ఒక కుమారుఁడును కలిగిరి. అటుపిమ్మట నీమె భర్తకంటె ముందే పరలోకమున కేగెను. ఆమెకొడుకు ప్రస్తుతము తండ్రి పనిమీఁదనే సుఖముగానున్నాఁడు.

జోగమ్మ మాయత్తిల్లును పుట్టిల్లును పవిత్రము చేసిన యువతి యగుటవలన నేను మిగుల ధన్యనైతిని. నాతండ్రిగారి కీమె పినతండ్రిభార్య. ఈమె యిట్టిసద్గుణవతియయినను మనదేశమునందలి చరిత్రను గుఱించి గలయౌదాసీన్యమువలన నామె చరిత్రము సవిస్తరముగా వ్రాయుటకుఁ దగు సామగ్రి దొరకదయ్యెను. అయినను ఈసాధ్వీచరిత్రము సవిస్తరముగా వ్రాయుటకు నేను యత్నింపుచున్నాను. ఈశ్వరకరుణవలనఁ జదువరులకుఁ ద్వరలోనే సమర్పింపఁగలను.