పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
29
పద్మిని.

మువలన స్వల్పకాలములోనే డిల్లీ బాదుషాయగు అల్లాఉద్దీను మేవాడ రాజధానియగు చితూరుపై దండు వెడలెను. ఈబాదుషా పద్మినియొక్క యసమాన సౌందర్యమువిని యామెయం దధికాభిలాషి యయ్యెను. అసహాయశూరులగు రజపూతులతోఁ బోరి గెలుచుట దుస్తరమని తలఁచి యాబాదుషా పద్మినిని వశపఱుచుకొనఁ జూచెను. కాన ప్రధమమునం దాయన తనసైనికులతోఁ జితూరుసంస్థాన ప్రాంతభూమిని వసియించి గుప్తముగా ననేక దాసీజనులకు ద్రవ్యాశఁ జూపి వారు తనరూపము, ఐశ్వర్యము మొదలగునవి పద్మినికిఁ దెలిపి యామె తనకు వశవర్తినియగుట కనేకయుక్తులను బన్నునటులఁ జేసెను. కాని సతీమణియగు పద్మినియొద్ద ఇట్టినీచప్రభువుయొక్క తుచ్ఛయుక్తు లెంతమాత్రమునుఁ బనికిరాక నిష్ఫలములయ్యెను. అందుకు బాదుషా మిగుల చింతించి తనకు పద్మినిపైనిఁ గలిగిన దురుద్దేశ్యమును మరల్చుకొనఁ జాలక రజపూతులతో యుద్ధము చేసి పద్మినిని జెఱఁ బట్ట నిశ్చయించెను. అల్లాఉద్దీను ఆసమయము నందు "పద్మినిని చేకొనుట యొండె ఈరాజపుతస్థానమునందే యుద్ధముచేసి ప్రాణములు విడుచుటయొండె" అని ప్రతిన పట్టెను. తదనంతరమాతఁడు తనసైన్యములతో నారాజధానిని ముట్టడించెను.

అల్లా ఉద్దీను తమనగరమును ముట్టడించుట విని యసమానశౌర్యధుర్యులగు రజపూతులు యుద్ధసన్నద్ధు లయిరి. అంత వారందఱు భీమసింహుని యాజ్ఞప్రకారము బైలువెడలి ప్రతిపక్షులతో ఘోరముగాఁ బోరఁ దొడఁగిరి. ఇట్లా యుభయ సైన్యములం గలవీరులు కొన్నిమాసములవరకును యుద్ధము