పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/305

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
291
వనలతాదేవి.

గల యనేకకుటుంబములలోని ప్రౌఢ స్త్రీలును సామాజికు రాండ్రైరి. ఆసమాజముయొక్క యుద్దేశములను గని ప్రవీణులగు పురుషులును మెచ్చుచుండిరి. ఈసభ నానాఁటికి వృద్ధిఁబొంది యనేక స్త్రీజనోన్నతకార్యములను జేయఁ గలుగుచున్నది. వనలతాదేవి బ్రహ్మమతావలంబిని యైనను నామె సద్గుణ సదుద్దేశములవలన నామె యన్నిమతములవారికి నిష్టురాలుగానే యుండెను. ఈమె యాదివారపు పాఠశాలను స్థాపించి ప్రతి భానువారము బాలురకును బాలికలకును, మంచి నీతులను గఱపుచుండెను. నాఁటిదినమున నామె తానురచియించిన యనేక నీతిపరములగు పద్యములను, హృద్యములగు కీర్తనలను వారికినేర్పి వారిచే మరల వానిఁ జదివించి యప్పుడప్పుడాబాలకులకుఁ దెలియునటుల బోధపరములగు నుపన్యాసముల నిచ్చుచు వారి మనసులయందు నీతి జ్ఞానములు పాదుకొనునటులఁ జేయుచుండెను. ఆమె యాబాలకులకు వినోదముగ నుండునటుల గద్యపద్యరూపములగు నాటకములను రచియించి యాపిల్లలచే నానాటకముగ నాడించి యందుమూలమున వారికిఁ గొంతసద్గుణములను నేర్పుచుండెను. ఆదివారము నాఁడీమె యొద్దికి వచ్చుటకు బడిపిల్లలంద ఱెంతో సంతోషపడుచుండిరి.

ఈమె మూఁడు సంవత్సరములనుండియు 'సుమతీ సమాజా'అను మతంబున నంత:పురమను మాసపత్రి'కను స్త్రీలకొఱకై ప్రచురపఱచుచుండెను. ఆ మాసపత్రికకు లేఖక, ఉప లేఖక, కార్యదర్శులందఱును స్త్రీ లే! ఈపత్రికలోని సంగతులును స్త్రీల కత్యంతోప యుక్తములుగా నుండును. దీని యంత: