పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
237
కృష్ణాకుమారి.

సమాధానము చెప్పుచు నవ్వుచు నుండునేకాని యాబాల యావిషముచే మృతి చెందదాయె. అంత రెండవభృత్యుఁడు మఱియొకపాత్రలో విషముపోసికొని వచ్చి యామెచే త్రాగించెను. కాని యందువలనను ఆమె మరణ చిహ్నము కానరా దయ్యెను.

తుద కామె చావనందునను సమరసమను నొకభయంకరమయిన విష మామె కిచ్చిరి. దానిని త్రాగిన వెంటనే యాకన్యారత్నముయొక్క పవిత్రచరితము ముగిసెను. కాని కృష్ణాకుమారి ధైర్యము, నిర్భయత్వము, సత్యశీలము, దేశముకొఱకుఁ దండ్రికొఱకుఁ జూపిన యాత్మత్యాగమును మొదలగునవి యీప్రపంచమునం దుండి యామె కీర్తిని నజరామరము చేయునున్నవి.


Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf