పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
224
అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఆమె పాతివ్రత్యమును బరీక్షింపవలెనని యీతంత్రమును బన్నిన రాణిగారు పద్మావతి మరణమును గని యేమి చేయుటకుఁ దోఁచక దు:ఖింపసాగెను. అదివఱకామె కీకార్యమునందుఁదోడుపడినవా రిపు డామెనే నిందింపసాగిరి. ఇట్లు రాణిగారు సపరివారముగా శోకింపుచుండు నంతలో రాజుగారును జయదేవుఁడును పురమునకు వచ్చిరి. వారిల్లుజొచ్చి పద్మావతి గతించుట విని యామెను సమీపించిరి. అంత జయదేవులు భార్యను గని తనదు:ఖము నాప:జాలక కొంతవఱకు దు:ఖించిన పిదప ధైర్యము నవలంబించి తనసంగీతము పద్మావతికి మిగుల ప్రియమగుట యెఱిఁగినవాఁడు గావున నామె ముందు రసవంతమయిన సంగీతము పాడ నిశ్చయించి తనవీణెఁ దెప్పించి తాను రచియించిన గీతగోవిందమును మిగుల మనోహరముగాఁ బాడఁజొచ్చెను. ఇట్లు సంగీతమున కుపక్రమించిన కొంతసేపటికిఁ బద్మావతి మొగముపైఁ గొంచెము తెలివి గానుపించెను. ఇరువదియైదవ అష్టపదిముగియఁగానే పద్మావతి తెలివొంది కనులు విప్పి తనముందుఁ గూర్చున్న జయదేవునిఁ గాంచెను. అంత నామె మిగుల నానందముతో భర్తకు నమస్కరించి యానంద బాష్పములతో నతని పదములను గడిగెను.

ఈయనర్థమున కంతకుఁ దనపత్నియే కారకురాలని క్రౌంచరాజు మిగుల కోపించి యామెను విసర్జింపఁదలఁచెను. కాని దయామయురాలగు పద్మావతి రాజును సమాధాన పఱచి భార్యాభర్త లెడఁబాయకుండఁ జేసెను. తదనంతరము పద్మావతీ జయ దేవులు కాశీక్షేత్రమున కరిగి యచటి పురుషులకు భక్తియు స్త్రీలకు పాతివ్రత్యమును ఉపదేశింపుచు