పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/211

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
197
గనోరుసంస్థానపురాణి.

విశేషానందము కలిగెను. నర్మదయొడ్డు నంటియున్న యొక విశాలభవనమునం దీవివాహప్రయత్నము చేయఁబడెను. రాణి సర్వాలంకారయుత యయి యొకమంచముపయి కూర్చుండి యుండెను. ఇతర రాజస్త్రీలును, దాసీలును పైని మంచి తివాచిపఱచిన యొకయుచ్చస్థలమునఁ గూర్చుండిచేత నొక్కొక దివిటీలను పట్టుకొనిరి. ఖాను రాఁగానే రాణిగా రాతనినొక మంచముపై కూర్చుండ నియమించెను. ఖానుసాహేబు రాణిగారి వాక్యములను శిరసావహించి మంచ మెక్కెను. ఆమంచముపై కూర్చుండి రాణిగారితో నేమో కొంతసేపు మాటాడిన పిదప నాదుష్టుని శరీరమునం దంతటను తాపముపుట్టి శరీరము నల్లఁబడి నాలుక లోనికి గుంజసాగెను. వాఁడు మరణవేదనకుఁ దాళఁజాలక నేలఁబడి పొరలఁదొడఁగెను. అప్పుడు రాణి వాని సమీపమున కరిగి మిగుల కఠినముగా వాని కిట్లనియె. "పాపీ! నీపాపఫల మనుభవింపుము. ఓచెడుగా! నీకు మృత్యువు సమీపించెను. నీవు తొడుగుకొనిన దుస్తంతయు విషముపూసినది. కాన నావిషమంతయు నీశరీరమున నింకెను. కనుక నిఁక నీవు జీవితాశను వదలుము. నాపాతివ్రత్య రక్షణమునకు వేరుపాయము గానక యీనింద్య కార్యమునకుఁ దెంపుచేయవలసే" ఖానుసాహేబుగారి యవస్థంగని యాతనిసేవకులు కొంతవడి రిచ్చవడి యూరకుండిరి. వారు తెలివితెచ్చుకొని యాగడము చేయ నెంచునంతలో రాణిగారు గవాక్షములోనుండి నర్మదలోనికిఁ దుమికిరి. అంత నామ్లేచ్ఛభటు లేమిచేయుటకుఁ దోఁచక నచటనున్న యితరస్త్రీలను బాధింప నెంచిరి. కాని యాస్త్రీలు తుపాకిమందు గోనెలపైఁ గూర్చుండి యుం