పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

అబలాసచ్చరిత్ర రత్నమాల.

కిట్లు చెప్పి పంపెను. "నేనును మీయతుల పరాక్రమము విన్నది మొదలు మీభార్య నగుటకుఁ దొందర పడుచున్న దానను. క్షత్రియస్త్రీలు పరాక్రమవంతులనె మెచ్చెదరు. నావంటి స్త్రీని వివాహ మగుటకుఁగా మీ రొప్పినదే నా కొకసన్మానమని తలఁచెదను. కాని మనవివాహప్రయత్నము చక్కఁగా జేయుటకయి నాకు కొంత యవకాశ మియ్యవలయును."

ఖానుసాహేబు మిగుల సంతోషముతో రాణిగారు చెప్పినట్లంతయు నొప్పుకొనెను. వానికి నాటిని బోలినసంతోషదినము జన్మించినదిమొదలు ప్రాప్తించకుండెను. కాన వాఁడు రాఁబోవు సౌఖ్యసముద్రములో మునిఁగియుండెను. ఇట్లాతఁ డానందమగ్నుఁడయియున్న కాలములో లగ్ననిశ్చయమునకని రాణిగారివద్దినుండి రత్నఖచితమగుదుస్తు ఖానునకు వచ్చెను. దానిం గనినపిదప నాతని సంతోషమునకుఁ బారములేదయ్యెను. అప్పుడు రణవాద్యములును, ఘోరనాదములును నెచ్చటలేని మంగళవాద్యములును, శుభవాక్యములును నలుగడల వినఁబడుచుండెను. తమసైన్యాధిపతి వివాహదినము గాన నామ్లేచ్ఛసైనికులు మదిరాపానముచే శరీరభ్రాంతిలేకయుండిరి. ఖానుసాహేబు మిగుల నానందముతో రాణిగారంపిన దుస్తు ధరియించి వివాహమున కెప్పుడు పిలుపు వచ్చునాయని నిరీక్షింపుచుండెను.

ఇంతలో రాణిగారివద్దినుండి పిలుపురాఁగాఁ బరమానందముతోఁ దురుష్కుఁడు వివాహమంటపముకడకు వచ్చెను. అచటికి వచ్చి యాతఁడు రాణిగారినిఁ గని తానదివఱకు వినిన దానికంటే నామె విశేషసౌందర్యవతిగా నుండుటవలన నాతనికి