పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
195
గనోరుసంస్థానపురాణి.

రాణి తీవ్రముగాఁ గోటలోని కరిగి ద్వారముల నన్నిఁటిని మూసికొనెను. ఈతొందరలో సైనికు లనేకులు కోటబయిట నుండుటచేఁ బగవారిచే నతిక్రూరముగాఁ జంపఁబడిరి.

కోటలో నత్యల్పసైన్యము రాణిగారితోడ నుండెను. ఆస్వల్పసైన్యముతోడ రాణి కొంతవఱకు సంగ్రామము నడపెను. కాని దానిని లక్ష్యపెట్టక విజయులగు నామ్లేచ్ఛులు కోటకు నిచ్చెనలు వేసి వేలకొలఁది కోటలోనికిఁ జొచ్చిరి. ఆసమయమునందు రాణిగారికి శరణు చొచ్చుటకంటె నొండుమార్గము లేనందున "కోటను మీస్వాధీనము చేసెదను; యుద్ధము నాపు" డని యాసైన్యాధిపతియగు తురుష్కునకు నొకదూత పరమున మంపెను.

రాణిగారివద్దినుండి వచ్చినకబురువిని యాఖానుసాహేబు మిగుల సంతసించెను. వాఁడదివఱకు రాణిగారి యసమానరూపమునువిని యామెపైనధికమోహము కలిగియుండెను. కానవాఁడు సంకోచపడక ఆవచ్చినదూతతోడ నిట్లని చెప్పిపంపెను. "తమ యధిక సౌందర్యమునకు నేను మెచ్చితిని. మీరిదివఱకు మహారాజ్ఞిపదవియందుంటిరి. కాన నేను జీవించియుండు నంతవఱకు నా పదవియే కలిగి యుండవలయును. నేను సేవకునివలె నీ గనోరురాజ్యము నేలేదను." ఈవాక్యములు వినఁగానే రాణిగారాదుష్టుని యభిప్రాయ మెఱిఁగెను. కాని యామె తానేమి చేయుటకును దోఁచక కొంతసే పేమియో యోచించి తురుష్కులపై నామెకుఁ గలకోపవహ్ని నార్పునుపాయము నొండు గానక నామ్లేచ్ఛుని నొకకపటోపాయముతోఁ జంప నిశ్చయించెను. ఇట్లు కృతనిశ్చయయయి యాదూతతోడనే ఖానున