పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
194
అబలాసచ్చరిత్ర రత్నమాల.

వలన రక్తప్రవాహము కానిదీ గనోరురాజ్య మొక యడుగయినను వారికిఁ జిక్కదయ్యెను. గనోరురాజాసంగ్రామమున తన శౌర్యసాహసములనంతను వినియోగించిచూచెను. కాని యాదినములు మహమ్మదీయులకు సుదినము లగుటవలన నాశౌర్యనిధియగు భూపాలుఁడు వీరస్వర్గమునకుఁ జని తురకలకే జయము ప్రాప్తించెను.

రాజు శూరసైన్యసహితముగా హతుఁ డగుట విని యాతని రాణి మిగుల దు:ఖించెను. కాని యాధైర్యవతి తన దు:ఖమునంతను మ్రింగి మరల క్రొత్తసైన్యమును సిద్ధపఱిచి తా నాసైన్యాధిపత్యమును స్వీకరించి హతశేషులగు తమసైనికులు మహమ్మదీయులతోఁ బోరాడుచున్న స్థలమునకుఁ జనెను. రాణిగారు సైన్యసహితముగాఁ దమకు సహాయమునకు వచ్చుటఁగని యావీరులు మఱింత శౌర్యముతోఁ బోరఁ దొడఁగిరి. రాణిగారును తనభర్తవలెనే యుద్ధమునందు మిగుల నేర్పుగలది యగుటవలన నామెధైర్యమువలన గనోరుసైన్యము మిగుల తెంపుతోఁబగర నడవఁ దొడఁగెను. కాని మ్లచ్ఛసైన్యమధికమగుట వలన వారిప్రయత్న మంతయు వృధయై రాణిగారు కోటలలో నైదుకోటలు తురకల పరంబులయ్యెను. తుదకల్పసైన్యముతో రాణిగారుమాత్రము జీవించియుండెను. అప్పటికిని నామెధైర్యము విడనాడక యుద్ధము చేయుచుండెను. మఱికొంతసేపటికి మహమ్మదీయులు మనసు పట్టుకొందురని రాణిగారికిఁ దోఁచి తన స్వాధీనములో మిగిలియున్న నర్మదాతీరపుకోటలోనికిఁబోయెను. ఆమె నర్మదాదాఁటి కిల్లాలోనికిఁ బోయినవెంటనే మహమ్మదీయు లాకోటను చుట్టుముట్టిరి. పగవారు సమీపించినందున