పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
166
అబలాసచ్చరిత్ర రత్నమాల.

రసమును జూచి యచటి ప్రజలు మిగుల నారందపరవశులయి తమ దు:ఖములను మఱచిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప రాజు బొక్కస మంతయు నొడిసెను. అప్పుడు రాజు, మంత్రి మొదలగువారి సహాయమువలనఁ గొన్ని దినములు ప్రజల యాఁకలివాపి తుదకు ద్రవ్యహీనుఁడును, ధాన్య రహితుఁడునునై ప్రజలబాధలు చూచుచు నుండవలసినవాఁడాయెను. అప్పుడు రాణి తమ ప్రజలబాధలు తొలఁగుటకయి యనేకోపాయములను చేసెను. తుద కామె తననగల నన్నిఁటిని నమ్మి యాద్రవ్యముతో నితర దేశములనుండి ధాన్యము తెప్పించి యన్నార్తుల కన్నము పెట్టుచుండెను. ఆహా! యీమె యౌదార్యము నేమని కొనియాడవలయును? కాని యా స్వల్పద్రవ్యముతోఁ గొనిన ధాన్యము ప్రజల కెన్నిదినములు చాలును? ఇంతటితో నా దేశపుక్షామము వదలనందున జనులలో ననేకోపద్రపములు గలుగసాగెను. జననీజనకులు తమ పిల్లలపయి నిర్దయులైరి. భార్యాభర్త లొండొరులపైఁగల పవిత్రమగుదాంపత్యప్రేమను విడనాడిరి. సహోదరప్రేమలు రూపుమాసె అందఱును దమతమ పొట్టకూటికయి నలువంకల విచ్చలవిడిగా దిరుగ సాగిరి. అన్నాభావమువలన ననేకజనులు మృతులయిరి. వృద్ధులు, బాలురు, తరుణులు ననుభేద మిసుమంతయును లేక యందఱును యమపురమునకు విందులయి చనిరి. పోఁగా మిగిలిన యల్పజనులును చూచుట కతి వికారరూపులయి మనమున నొక విధమగు భయము పుట్టించువారయి యుండిరి. అప్పు డాకాశ్మీరదేశము కేవలము దండధరుపురమును బోలి