పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
167
వాక్పుష్టా.

యుండె. ఇట్టివిపద్దశయందొకరాత్రి పురజను లన్నమున కయి రాజగృహమును ముట్టడించి యాక్రందనము చేయసాగిరి. క్షామమువలనను గత్తరవలనను పీడింపఁబడిన యాదీనజనుల దురవస్థనుగని వాక్పుష్ట మిగుల చింతాక్రాంతయయి, నివారించు నుపాయము గానక సదయాంత:కరణయై తనపతి బుజముపైఁ దలవాల్చి యిష్టదేవతను ప్రార్థింపుచుండెను. ఆసమయమున దు:ఖమువలన చిత్త వ్యాకులుఁడయిన తుంజీనుఁడు తన పత్నితో 'కాంతామణి! మనము చేసిన పాపమువలన మన ప్రజల కిట్టికష్టములు సంభవించె. నాదురదృష్టమువలన ధనమంతయు వ్యయమయ్యె. ప్రజల యాఁకలి నివారించుట కెన్ని యుపాయములుచేసిన నవన్నియువృధలయ్యె; నిట్టి నరాధముఁడనగు నాజన్మము కాల్పనా? నేను బ్రతికి యుండఁగానే నా ప్రజలు చచ్చుచున్నవారు. మనముచేసిన ప్రయత్నములన్నియు నిష్ఫలములయ్యె. మనగర్భమునఁ గన్నవారివలెఁ గాపాడిన యసంఖ్యప్రజనాశ మొందెను. ఇంకను నాశ మొందనున్నది. రాజ్యమునండెటు చూచినను పతులకయి విలపించు సతులును పుత్రులకయి శోకించు జననీజనకులును, అన్నమునకయి యారాటపడు జనులును నమితముగా నగుపడుచుండెదరు. ప్రపంచమునందింత కంటెను దు:ఖకరమగు సమయము వేఱుగ నుండునా? రత్నములతోడను, సువర్ణరజతాది ద్రవ్యముతోడను ధాన్యసమృద్ధితోడను, నొప్పి సుందరముగాఁ గానుపించు నీకాశ్మీరదేశము నేఁడు శ్మశానతుల్యముగాఁ గానుపించెడిని. నలుదిక్కులనుండి విపత్సముద్రములో మునుఁగుచున్న యీ ప్రజకుఁ దరుణోపాయ మెయ్యది? ఈదుస్సహ మగు ప్రజా