పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాక్పుష్టా

ఈ పుణ్యశీల కాశ్మీరాధిపతిగా నుండిన తుంజీనునికిఁ బత్ని. ఈరాజు మిగుల ప్రజావాత్సల్యము గలవాఁడనియు, ధర్మాత్ముఁడనియుఁ గీర్తిఁ గాంచెను. ఆయన భార్యమిగులధర్మాత్మురాలును, ధైర్యవతియునయి యుండెను. తుంజీనుఁడు తనసతి సహాయమువలన రాజ్యము నేలుచుఁ బ్రజలను సుఖులనుజేయు చుండెను. కాని యొకానొక సమయమునం దాదేశమునందలి ప్రజలకు క్షామమువలన గొప్పయాపద సంభవించెను. అట్టిసంకటసమయమునందా సుశీలచూపినధైర్యమును స్వప్రజారక్షణమునకయి పడిన పాట్లును మిగులస్తుత్యములు.

కాశ్మీరదేశము తుంజీనుని పరిపాలనదినములలో సర్వైశ్వర్యయుతమయి యుండియచటి ప్రజలకు మిగుల సుఖకరంబై యుండె. తుంజీనుఁడును న్యాయపరిపాలనము చేయుచుఁ దనప్రజల నానందింపఁ జేయుచుండెను. ఇట్లుండఁగా నొక సంవత్సరము ఫాల్గుణమాసమునం దాదేశమునం దంతటను మంచు కురిసి కోఁతకు సిద్ధము లయిన పొలములపై నంతటను మంచు గట్టిగాఁబేరెను. అందువలన ధాన్య మంతయు నాశ మొంది యాదేశమున గొప్ప కాటకము సంభవించెను. అందువలన జనులన్నార్తులై తిరుగుచుండిరి. రాజు తనపత్ని సహాయవలన క్షుద్భాధాపీడితు లగుజనుల నాదరింపుచు, వారి కందఱకు నన్నము పెట్టింపుచుండెను. అప్పుడు వాక్పుష్టకుఁ గలదయా