పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
100
అబలాసచ్చరిత్ర రత్నమాల.

ముల కంపించి వైద్యశాస్త్ర ప్రవీణలను గావించి, వారిచే నిచ్చటం బ్రమదల కావైద్యశాస్త్రమును గఱపు కళాశాలలను స్థాపింపఁ దలంపమికి నేనత్యద్భుతము నొందుచున్నదానను. తనకుఁ గలలోపముల నెల్ల వెల్లడిసేయక తన్ని వారణార్థమై యర్థింపకయుపేక్షించు నిందాస్పదమైనదియు ఈహిందూదేశమునకంటె మఱియొక్కటి యేదియులేదు. ఈహిందూదేశమంతట స్త్రీవైద్యులులేని లోపము కష్టముగనున్నధి. యూరపుదేశపునారులును, హిందూసుందరులును, అవసరము తటస్థించినప్పుడు పరపురుషులకు తమ దేహస్థితిని వివరించి వారిచేఁ జికిత్సఁ జేయించుకొనుటకు సహజముగా నిష్టపడకయున్నారు.. యూరపు, అమేరికాదేశములనుండి యిక్కడకు కొందఱు స్త్రీవైద్యులు వచ్చుచున్నారు గాని, వారిభాషయు, నాచారమర్యాదలును మనవారికిఁ గ్రొత్తలగుటచే, వారుమన స్త్రీల కంతగా నుపయోగపడక యున్నారు. తమదేశమందును దమవారియెడలను నైసర్గిక మయినప్రేమ గల హిందూసుందరులు పరదేశ యువతులతోఁ గలిసి మెలఁగలేరు. కావున నా వలన నేసహాయ లాభమును బడయఁజాలక యున్నారు. ఈ హిందూదేశమున స్వదేశస్త్రీవైద్యుల యక్కఱ మిక్కిలిగా నున్నట్లు నాకుఁ దోఁచుచున్నది.

2. ఇఁక నీహిందూదేశమునం దందులకుఁ దగినసాధనములు లేవా యను రెండవ ప్రశ్నమున కుత్తరము : _ లేవని నిష్కర్షగా మనవి చేయుచున్నాను. అనఁగా సాధనములు బొత్తిగా లేవని నామతము కాదు. కాని యున్నసాధనములు సులభసాధ్యములు గావని నాయభిప్రాయము. చెన్నపురియం