పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
99
డాక్టరు ఆనందీబాయి జోశి

న్యాస మత్యంత శ్రవణీయము. కాన జనానాపత్రికోక్తముగా నిచ్చట నుదాహరించుచున్నాను.

"నాయమేరికాదేశ యాత్రనుగుఱించి వందలకొలది ప్రశ్నము నన్న నేకు లడుగుచున్నారు. కావున నే నిప్పుడు అవకాశముఁ గలుగఁజేసికొని వానిలోఁ గొన్నిటికిఁ బ్రత్యుత్తరములం జెప్పఁ దలంచితిని, అవి యెవ్వనఁగా : _

1. నే నమేరికాదేశ మేల వెళ్ళవలెను?

2. హిందూదేశమునందుఁ గృషిచేయుటకు నాకు సాధనములు లేవా?

3. నే నొంటరిగా నేల వెళ్ళవలెను?

4. నే నీదేశమునకు తిరిగివచ్చినప్పుడు జాతిలోనివారి నుండి నాకు బహిష్కారము గలుగదా?

5. ఏదేని యాపదసంభవించినయెడల నే నేమిచేయ వలెను?

6. స్త్రీలలో నెవరును జేయని పనిని నేనెందులకుఁ జేయవలెను? అనునవి.

1 మొదటిప్రశ్నకుత్తరము : _ నేనువైద్యము నేర్చుకొనఁ దలఁచి యమేరికాదేశమునకు వెళ్ల నిశ్చయించితిని. ఈహిందూదేశమునందు స్త్రీలకు జికిత్సఁ జేయఁదగిన సాధనకలాపము లేని కారణమువలనఁ గలిగెడి బాధలను ఇప్పుడిక్కడకు దయచేసిన నారీమణులు బాగుగాఁదెలిసికొని యున్నారు. ప్రకృతిశాస్త్రములను, స్త్రీవిద్యను వెలయింపఁ జేయ నీదేశమున వెలయుచున్న సమాజము లెవ్వియు మనదేశపు యువతుల నేరినిఁగాని నాగరికతచేఁ ప్రతిష్ఠ గాంచిన ఖండాంతర