పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు ఆనందీబాయి జోశి.

స్త్రీవిద్యా విజయ దుందుభి !!!

                 గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత
                     వెఱచిరే ఘోరకాకోల విషముచేత
                     విడిచిరే యత్న మమృతంబు వొడమ దనుక
                     నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.

ఇయ్యుత్తమకాంత క్రీ. శ. 1865 వ సంవత్సరము మార్చినెల 31 వ తేదిని పూనాపట్టణమునందు జన్మించెను. ఈమె తండ్రిపేరు గణపతిరావ్ అమృతేశ్వరి జోశి. ఈయన పూర్వులార్జించిన యగ్రహారములోని ధనమువలనఁ జీవింపు చుండెను. వీరి నివాసస్థలము కళ్యాణపట్టణము. ఆయనభార్య పూనాకుఁ బుట్టినింటికి నీళ్ళాడఁబోయెను. కాన ఆనందీబాయి యచటనే జన్మించెను. మనదేశమునందలి యాచారమువలన నాఁడుబిడ్డ పుట్టుటవలనఁ దలిదండ్రులకేమి బంధువులకేమి మిగుల వ్యసనము కలుగును. అదేప్రకార మీమె జననీజనకులును విచారపడిరి! అప్పు డీబిడ్డవలనఁ దామును ప్రసిద్ధుల మగుదుమని వారికేమి తెలియును? దేశాచారప్రకారము పదునొకండు దినములు గడచినవెనుక పండ్రెండవదినము బారసాలచేసి పిల్లకు యమునయని నామకరణము చేసిరి. శిశువునకు మూడునెలలు వెళ్ళఁగానే, తల్లి కళ్యాణమునకు వెళ్లెను. య