పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
91
డాక్టరు ఆనందీబాయి జోశి

మున క్రమక్రమముగా బాలలీలను చేయుచుఁ దల్లిదండ్రుల నానందసాగరమున ముంచుచుండెను. ఈమె నాలు గైదుసంవత్సరముల వయసునందుననే మిగుల తెలివి గలదిగా నుండెను. అటుపిమ్మట నాచిన్నదియింటిలో నుండినఁ జెఱుపుపనులు చేయునని తల్లి సమీపమునం దున్న బాలికాపాఠశాల కామెను బంపఁ దొడఁగెను. కాని చిన్నతనమువలన నాచిన్నది విద్యాభ్యాసమునందుఁ జిత్తము లేనిదయి యుండెను. ఆమె తల్లి బిడ్డలను గొడ్డువలె బాదు మూర్ఖస్త్రీలలోనిది యగుట వలన నామె చిన్నతనమున తల్లి చనువులేక యెప్పుడును శిక్షకుఁ బాత్రురా లగుచుండెను. ఆమెతల్లి తల్లియు గణపతిరావుగారి యింటనే యుండెను. కాన యమున నెవ్వరేమనినను నాముసలమ్మవారితోఁ దగవు లాడుచుండెను. యమున చిన్న తనమునుండియు నేదో యొకపనిలేక కూర్చుండు స్వభావము గలదిగాక సదా యేదో యొకపనిని చేయుచునే యుండెను. యమున యేడుసంవత్సరములది కాఁగానే తల్లిదండ్రుల కామె వివాహమును గుఱించి చింత కలిగెను. వా రనేకస్థలముల వెదకి యనుకూలుఁ డగు నరుని చింతించునెడ నొకగృహస్థుఁడు ఠాణా యనుగ్రామమునుండి కళ్యాణమునకు వచ్చెను. ఆయనతో గణపతిరావు కొమార్తె వివాహ చర్చ తేఁగా నాయన "ఠాణాలోని పోస్టుమాస్టరుగారిభార్య నివర్తించెను; మీరా యనకడకు వెళ్లివిచారింపుఁ డ"ని చెప్పెను.

ఆయన చెప్పినవాఁడు గోపాలవినాయక జోశి సంగమ నేర్‌కర్‌గారు. ఈయన తనచిన్నతనములోఁ దనయక్కయుఁదానును జదువుకొను కాలములో స్త్రీలబుద్ధి పురుషులబుద్ధితో