పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
89
రుద్రమదేవి

ణముచేసెను. తదనంతర మాబాలకుఁడు దినదిన ప్రవర్థమానుఁడై శివదేవయ్యవలన సకలవిద్యల నభ్యసింపుచుండెను. ఈయన వెనుక ఉమ్మక్కకు మఱియొకపుత్రుఁడు కలిగెను. అతనికి అన్నమదేవుఁడని పేరిడిరి.

రుద్రమదేవునికి గర్భాష్టకంబున నుపనయ నంబుచేసి విద్యలన్నియు నేర్పి రాజ్య మాతని కిమ్మని శివదేవయ్య కొప్పగించి క్రీ. శ. 1295 వ సంవత్సరంబున రుద్రమదేవి దివి కరిగెను. ఈమె మనయాంధ్రదేశంబునకు శొరోరత్నమని చెప్పుట కెంతమాత్రమును సందియములేదు. స్త్రీలలో నిట్టివా రుందురని ప్రత్యక్షప్రమాణమువలన నెఱిఁగియు మనవారు స్త్రీలను హీనముగాఁ జూచుట మిగుల శోచనీయము.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf