పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేరిని బూజింపక తనతల్లినే దేవతయని పూజించుటకు గారణము కూడ వ్యక్తమగుచున్నది."

పేదలదు:ఖముల గనినభగవతీదేవికి మిగుల జాలిపుట్టి కన్నుల నీరు గారుచుండెను. ఆకొన్నవారికి నన్నమిడుటయు, రోగుల కౌషధోపచారము లొనర్చుటయు, త్రుష్ణాతురుల కుదకదానము చేయుటయు, చలికి బాధపడువారికి వస్త్రములొసంగుటయు లోనుగాగలవి భగవతీదేవియొక్క నిత్యవ్రతములు. ఎవ్వరికేని రోగమువచ్చినయెడల భగవతీదేవి చేత నౌషధములు తీసికొని వారిసేవచేయుటకు సిద్ధముగా నుండెను. ఎవ్వరేని అర్ధాభావము వలన బాధపడుచుండినచో, భగవతీదేవి తనచేత గలది కొంగున గట్టుకొని వారికి గుప్తముగా సహాయపడుటకు చనును; ఎవ్వరేని చలివలన బాధపడుచుండినచో భగవతీదేవి తనవెచ్చనిబట్ట వారి కిచ్చును! ఆమె బ్రాహ్మణ కులమునందు జన్మించినదైనను నీచకులీనుల మలమూత్రములు తీసి వారి కుపచారములు చేయుటలో నెన్నడును అసహ్యపడినదికాదు. ఇదియే నిజమయిన భూతదయ.

ఒకాకొక సమయమునందువిద్యాసాగరు డింటివారుకప్పుకొనుటకు గొన్నిఊర్ణ వస్త్రముల నింటికి బంపెను. అవి ఇంటికిరాగా జూచి తమపొరుగువారలు చలిచే బాధపడుచుండుట గని భగవతీదేవి వానిని పొరుగువారల కిచ్చి కొడుకున కిట్లు వ్రాసెను. "ఈశ్వరా! నీవు పంపినబట్టలు మనపొరుగువారలు చలిచే బాధపడుచుండగా వారి కిచ్చితిని, కాన మనయింటి కొరకు వేరేబట్టలు పంపవలయును." తల్లియొక్కభూతయకు