పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసి చూచెను. గాని యందువలన నాపిచ్చి కుదరకుండెను. కాన తుదకొక జ్యోతిష్కుని బిలిచి యడుగగా నాజ్యోతిష్కుడు భగవతీదేవియొక్క జాతకమును ఆమెయవయవములును జూచి ఇట్లుచెప్పెనట. " ఈమె గర్భమునం దొకమహాపురుషుడు గలడు. ఆయనప్రభావము వలననే యీమె కిట్టియున్మాదావస్థగలిగెను. బ్రసవానంతర మీమె బాగగును. ఇప్పుడౌషధోపచారములు చేయుటవలన నేమియు బ్రయోజనములేదు." 1742 వ సంవత్సరము ఆశ్వయుజమాసమునందు సాక్షాత్‌దయయొక్క యపరావతారు డగు ఈశ్వరచంద్రుడు జన్మించెను. నీళాడిన పిదప భగవతీదేవికిగల యున్మాదము పోయెను.

భగవతీదేవి విశేషరూపవతి గాకున్నను, ఆమెముఖమునందలి తేజము విశేషహృద్యముగా నుండెను. వంగదేశము నందలి యాధునిక ప్రఖ్యాతకవి యగు రవీంద్రనాధుడు భగవతీదేవి రూపమునుగూర్చి యిట్లు వ్రాసెను - "భగవతీదేవి ముఖమునందలి గాంభీర్యము, నుదారతయు నెంత చూచినను తృప్తికలుగదు. అమె బుద్ధియొక్క ప్రసారతను దెలుపునున్నత లలాటము, సుదూర దర్శులును స్నేహవర్షులునునగు ఆ యతనేత్రములు, సరలనాసిక, దయాపూర్ణమైన యోష్ఠోదరము, దృడతా పూర్ణమైన చుబుకము - ఇట్లన్ని యవయవములు పొంకముగగలిగి మహిమ మయమైన యామె ముఖసౌందర్యము చూచువారి హృదయమున కధికముగా బూజ్యభావమును బుట్టించును. ఇందువలన (భగవతీదేవి ముఖమునందు దైవికకళ గలిగినందున) నే విద్యాసాగరుడు ఇతర పౌరాణిక దేవతల