పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వల్పవిద్య నేర్చి యల్పవేతనముగల యుద్యోగమును సంపాదించెను. ఆ దినములలో భోజనసామగ్రి చవుకగా దొరకుట వలన స్వల్పవేతనముగల యుద్యోగము దొరకినను ప్రజలానందించు చుండిరి. ఠాకుర్‌దాసునకు 8 రూపాయల వేతనముగల పని దొరకుట విని దుర్గాదేవి తన పర్ణకుటీరములో నానందోత్సవము చేసెను. వారి హితకాంక్షులందరా సమయమున మిగుల సంతసించిరి. తదనంతరము కొన్ని దినములకు రామజయుడు (విద్యాసాగరుని తాతవచ్చి) భార్య కష్టములనువిని మిగుల చింతనొంది పుత్రుని గనుగొని యాతని వివాహము జేసి మరల తీర్థాటనమున కరిగెను; గాని యాతడు పూర్వమువలె విశేష దినములు తీర్థాటనము చేయచునుండక త్వరలోనే యింటికి వచ్చెను. ఆయన వచ్చినందున కిట్లొక కారణమును జెప్పెదరు. ఒకదిన మాతడు కేదారపర్వతమున నిదిరించుచుండగా నొక మహాపురుషుడాయన స్వప్నమున నగుపడి ఇట్లనెను. "ఓ రామజయుడా! నీ వేల నీ కుటుంబమును విడిచి తిరిగెదవు? త్వరగా నీవు యింటి కరుగుము. మీ వంశమునందొక మహాపురుషుడు పుట్టగలడు. వాని దయాదాన విద్యాదిగుణములచే మీవంశము కీర్తిగాంచును. పరమేశ్వరునికి మీయందు విశేషదయగలదు." ఈ స్వప్నముజూచి రామజయుడు వీరసింహగ్రామమునకు వచ్చి చూచునప్పటికి ఠాకూర్ దాసు కలకత్తాలో నుద్యోగము చేయుచుండెను. అతని భార్యయగు భగవతీదేవి గర్భవతియయి యున్మాదముగలిగి యింటియొద్దనే యుండెను. రామజయుడు కోడలి పిచ్చిపోవుట కనేకౌషధములలును, మంతతంత్రములును