పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననుకూలము లయినపటములను వ్రాయునటులను, నియమించుకొనిరి. కాని, యదియంతయు నారూబాయి మరణముతో నడగెను. ఈ యక్క చెల యండ్రిద్దరును గాయనముందసమాన ప్రజ్ఞగలవారై, యనేక వాద్యములను బహు కుశలతతో వాయించుచుండిరి. వీరు తమ విద్యాభ్యాసమును చేయుచు సాధారణకుటుంబపు స్త్రీలవలెనే తమ గృహకృత్యములను చక్క బెట్టుచుండిరి. 'ఆడుది చదివి చెడె' నన్న మూర్ఖపులోకోక్తి యబదమనియు, 'చదువక మగవాడు చెడె' నన్న లోకోక్తి వలెనే 'చదువక యాడుది చెడె' నన్న లోకోక్తియే నిజమని యీ యక్కచెల్లెండ్రు ఉదాహరణ పూర్వకముగా స్థాపించిరనుటకు సందేహము లేదు.

తోరుదత్తు అన్ని పనులయందును చురుకుతనము జూపుచుండెను. ఆమెకు బ్రతిపనియందును గల బుద్థికుశలత జూచి యామె తండ్రి మిక్కిలి యద్భుతము నొందుచుండెను. ఆమె జ్ఞాపకశక్తి బహు యద్భుతము. ఆమె రచించిన పద్యము లన్నియు, నామెకు బాఠముగా నుండెనట. సంస్కృత, బంగాళ, ఇంగ్లీషు, ఫ్రెంచు భాషలలోని మహాకవీశ్వరుల పద్యము లనేకము లామెకు గరతలామలకములై యుండెనట. ఆమె తాను చదివిన గ్రంథముల నన్నిటిని తిరిగి యొకసారి మననము చేయుచుండెను. ఒకానొక చోట దనకర్థము తెలియకుండిన మరలమరల జదివి, యందలి యర్థమును గనుగొనినగాని ముందు చదువునదికాదు. ఇటుల నామె యాత్మోన్నతియందు మిగుల తత్పరురాలై యుండెను. తోరుదత్తు తనయక్క