పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందైనను అనుకొనినవారు కారు. అట్లగుట సాధ్యమని చెప్పిన నెవ్వరును నమ్మకుండిరి. మనదేశపుస్త్రీ లనేకశతాబ్దముల నుండి యజ్ఞానాంధ కారమునకు బుట్టి నిల్లు చేయబడినందున హిందూదేశమునందలి యొక యబల ఈ పద్యముల వ్రాసెనని యెవ్వరును తలపరైరి. తోరుదత్తు ప్రథమమున నొక ఫ్రెంచు కవిని గూర్చియొక వ్యాసమువ్రాసి యొకమాసపత్రికలో బ్రసిద్ధపరిచెను. ఆపత్రిక యందు నామె ఫ్రెంచుభాషయందలి యనేక పద్యముల నింగ్లీషునందు భాషాంతరీకరించి యచ్చు వేయించు చుండెను. ఆకాలమునం దాపత్రికను జదివిన వారి కామె వ్రాసిన వ్యాసములును పద్యములును బహు ఆనందము గలిగించు చుండెను.

ఇంతలో 1874 వ సంవత్సరమునం దీమె యక్కగారగు ఆరూబాయి క్షయరోగమువలన బరలోకవాసినియయ్యెను. ఆరూబాయి కవిత్వకల్పనలయందు జెల్లెలికంటె దక్కువ నేర్పరి యైనను, బంగాళీ, యింగ్లీషు, ఫ్రెంచుభాషలయందలి పాండిత్యమునందు తోరుతో సమానముగా నుండెను. ఈమె వృత్తియు బహు సాధువృత్తియైయుండును. ఆమెకు నేకాంతవాసమునందుండుటయే యధిక సౌఖ్యకరమై యుండెను. ఆరూబాయికి దనపేరు ప్రసిద్ధియగుట యెంతమాత్రమును ఇష్టము లేకుండెను. కాని, యామె తనచెల్లెలి కవిత్వస్ఫూర్తిని గని సంతోషించు చుండెను. ఈమె పటములను వ్రాయుటయందు మిగుల ప్రవీణురాలుగా నుండెను. ఈయక్కచెలియండ్రిద్దరలో తోరుదత్తు గ్రంథములను రచించునటులను, ఆరూబాయి యాగ్రంథములకు