పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వధ చేయజాలను." అప్పు డా రాణీగారు మిక్కిలి విచారించి, మ్లేచ్ఛులామెను సమీపించుట గని, తన ఖడ్గమునకు మ్రొక్కి దానితో దనంతట దానే పొడుచుకొని రణభూమియందే ప్రాణములు విడిచెను!!! రాణీగారి శవము మ్లేచ్ఛులచే బడకుండ నామె సేవకుడు భద్రపరచి, తానును యుద్ధముచేసి యచటనే మృతుడయ్యెను! రాణీగారి కుమారుడును పరలోకగతుడయ్యెను. ఇట్లొక తురకబాదుషాయొక్క రాజ్యలోభముచేత గోండు సంస్థానములోని నిరపరాధులగు లోకులందరు హతులైరి. ఆహా! రాజ్యలోభ మెట్టి ఘోరకృత్యములను జేయునో చూడుడి.

ఈ రణ శూరయైన దుర్గావతి యొక్క సమాధి జబ్బలపురమువద్ద నున్నది. ఆ సమాధియొద్దనే ఈమె గుణవర్ణనాత్మకమైన శిలాశాసనము కలదు. అచ్చటికి వెళ్లిన బాటసారు లందరును ఆ సమాధిని మహాభక్తితో జూచి, ఈ శూరనారినిగురించి పూజ్యభావమును వహించెదరు. బరమ ధార్మికుడయిన యొక బాటసారి యిందును గురించి యిట్లు వ్రాసియున్నాడు. "దుర్గావతి యొక్క సమాధి యా పర్వతదేశమునందు నిర్మించబడినది. అచ్చట రెండు పాషాణస్తంభంబులున్నవి; వానిని జూడగానే వెనుక జరిగిన యుద్ధము మూర్తివంతముగా గనుల యెదుట గానబడును. ఆ గిరిశిఖరముమీద నిప్పటికిని భయంకరమైన రణ ఘోషము రాత్రిపూట వినవచ్చునని అచ్చటిలోకులు నమ్మెదరు. నిర్జనమయ్యును, రమణీయమగు నీ స్థలమునకు వచ్చెడి బాటసారులు ప్రేమపూర్వకముగా రాణీగారి సమాధిని దర్శిం