పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తురు. ఆమె పరాక్రమశ్రవణముచే విస్మయచిత్తులయి నానందములో నామె సమాధిని బూజించెదరు. ఆ స్థలమునందు బ్రకాశమానము లయిన గాజుతునకలనేకములున్నవి. ఆగాజుతునకలే రాణీగారికి బాటసారులర్పించెదరు. ఈపూర్వాచారము ననుసరించి, నేనును దుర్గావతియొక్క దివ్యగుణములను అభినందించుటకయి యొకగాజుతునక సమాధికి నర్పించితిని." అవును, ఇట్టి యలౌకికశౌర్య మేరికినభినందనీయము గాకుండును? క్షత్రియులకు నత్యంత శ్రేయస్కర మయిన ధర్మమును నాచరించి స్వర్గద్వారమునందు జొచ్చినవారు పురుషులయినను, స్త్రీలయినను సర్వజనవంద్యులే. కృష్ణ మూర్తియు నర్జునున కదియే బోధించినాడు:-

    యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వార మసావృతం
    సుఖిన: క్షత్రియా: పార్ధ! లభంతే యుద్ధ మిదృశం.*


_______


  • ఓ అర్జునుడా! కోరకుండ సంభవించినట్టియు, తెరవబడిన స్వర్గద్వారరూపమయినదియు నగు నిట్టి యుద్ధమును ఏరాజులు పొందుచున్నారో వారలు సుఖులగుచున్నారు - భగవద్గీత. అ. 2.శ్లో 32.