పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికములయిన యనేక ధర్మకృత్యములను జేసియున్నది. తురుష్కుల ధర్మశాస్త్రప్రకార మామె ప్రతిదినమును మూడు పూటల దప్పక ఈశ్వర ప్రార్ధన చేయుచుండెను. 1863 వ సంవత్సరమున, ఆమె రాజ్యమంతయు బిడ్డ కప్పగించి, ఆరాజ్యమును కాపాడవలయునని ఇంగ్లీషు ప్రభుత్వమువారికి విన్నవించి, తాను మక్కాయాత్రకు వెళ్ళెను. మన హిందువులకు గాశీ యెటులనో, తురష్కులకు మక్కా అటులనని చదువరులు గ్రహింపగలరు. యాత్ర చేసికొని అచ్చట ననేక ధర్మములు చేసి, దానశూరురాలని కీర్తిని జెందెను. అచ్చటినుండి తిరిగి తన రాజ్యమునకు వచ్చి, 1868 వ సంవత్సరము వరకు బరమార్థ విచారములో సుఖముగా గాలము గడిపెను. 1868 వ సంవత్సరమున నీమెకు నొక వ్యాధికలిగి, అక్టోబరు నెల 30 వ తేదీని ఈమె కాలధర్మమును జెందెను. అప్పు డీమె ప్రజలును, ఇంగ్లీషువారును దు:ఖితులయిరి.

ఈమె కాలము చేసినతరువాత నీమె కూతురగు షహాజన్ బేగము సింహాసనమెక్కి, మిక్కిలి న్యాయముతో రాజ్యము చేయుచున్నది. తల్లివలె నీమె ప్రజావాత్సల్యము నందును, ఇంగ్లీషువారియెడ రాజభక్తి దృడముగా జూపుటయందును మిక్కిలి ఖ్యాతినిగన్నది. ఈమె సుగుణములను దర్బారునందు నింగ్లీషువారు పొగడి, యీమెకు జీ. సీ. యస్. ఐ అన్న పదవిని ఇచ్చరి.

లార్డు ల్యాండ్సు డౌన్‌గారి ప్రభుత్వ సమయమునందాయన భూపాలు సంస్థానము జూచుటకు వెళ్ళి, యచ్చటి